Jobs: జిల్లా కోర్టుల్లో 275 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. 11 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు..
జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 275 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 11న ప్రారంభం కానుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ఎగ్జామినర్ పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, రికార్డు అసిస్టెంట్ పోస్టులు, ప్రాసెస్ సర్వర్ పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలయింది.
జిల్లాల వారీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17 పోస్టులు, కోర్టు ఆఫ్ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్ సీబీఐ కేసెస్, హైదరాబాద్ 4, సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్ 14, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్ 1, జగిత్యాల 14,
జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 8, జోగులాంబ గద్వాల 8, కామారెడ్డి 9, ఖమ్మం 6 ఖాళీలు ఉన్నాయి.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 8, మహబూబాబాద్ 7, మంచిర్యాల 7, మెదక్ 1, మేడ్చల్-మల్కాజిగిరి 18,
ములుగు 6, నాగర్ కర్నూలు 19, నల్గొండ 9, నారాయణపేట 6, పెద్దపల్లి 4, రాజన్న సిరిసిల్ల 2,
రంగారెడ్డి 43, సంగారెడ్డి 9, సిద్దిపేట 11, సూర్యాపేట 5, వికారాబాద్ 12, వనపర్తి 9, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.
డిగ్రీ పూర్తయిన వారు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వారు 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎగ్జామ్ ఫీ ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600 కాగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400. మర్చిలో పరీక్ష నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications