UGC NET December 2023 Results: యూజీసీ నెట్ ఫలితాల విడుదలకు రెడీ-ఇలా చూసుకోండి.. !

దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్ మెంట్ తో పాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష ఫలితాల వెల్లడికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ సెషన్ కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను రేపు ఎన్టీయే విడుదల చేయబోతోంది. ఈ ఫలితాలను ఎలా తెసుకోవాలన్న దానిపై అభ్యర్ధులకు ఎన్టీయే పలు సూచనలు చేస్తోంది. వీటిని ఓసారి పరిశీలిద్దాం.

యూజీసీ నెట్ డిసెంబర్ 2023 పరీక్షలు గతేడాది డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 14 వరకూ జరిగాయి. దేశవ్యాప్తంగా 292 పరీక్షా నగరాల్లో జరిగిన ఈ పరీక్షలకు 9,45,918 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్టీఏ తాత్కాలిక యూజీసీ నెట్ డిసెంబర్ 2023 ఆన్సర్ కీలను కూడా విడుదల చేసింది. అభ్యర్థులు జనవరి 5లోగా ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అనుమతించారు. తుది ఆన్సర్ కీ మాత్రం ఇంకా విడుదల చేయలేదు. వీటి ఫలితాలు రేపు విడుదల చేయనున్నారు.

NTA all set to release UGC NET December 2023 Results- here is how to check

యూజీసీ నెట్ ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in ద్వారా విడుదల చేస్తోంది. అభ్యర్ధులు యూజీసీ నెట్ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్‌లు, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది. రేపు ఏ సమయానికి ఫలితాలు విడుదల చేస్తారన్నది ఎన్టీఏ కచ్చితంగా వెల్లడించలేదు. అయితే ఫలితాలు విడుదల కాగానే అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

యూజీసీ నెట్ డిసెంబర్ 2023 పరీక్ష లో మార్కింగ్ స్కీమ్ ప్రకారం ప్రతీ ప్రశ్నకు రెండు మార్కులు ఇచ్చారు. నెగెటివ్ మార్కులు మాత్రం లేవు. ఏదైనా ప్రశ్న తప్పుగా, అస్పష్టంగా ఉన్నట్లు లేదా బహుళ సరైన సమాధానాలను కలిగి ఉన్నట్లు గుర్తించబడితే, ప్రశ్నను ప్రయత్నించి సరైన సమాధానాలలో ఒకదాన్ని ఎంచుకున్న అభ్యర్థులకు మాత్రమే క్రెడిట్ ఇస్తారు. ఒక ప్రశ్న తప్పుగా గుర్తించి దాన్ని డ్రాప్ చేస్తే , ఆ ప్రశ్నను ప్రయత్నించిన అభ్యర్థులకు మాత్రమే రెండు మార్కులు ఇస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+