UGC NET 2025: అడ్మిట్ కార్డులు విడుదల - పరీక్షా విధానం..!!
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షకు సర్వం సిద్దమైంది. ఎన్టీఏ ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ల ద్వారా వీటిని డౌన్ లౌడ్ చేసుకోవచ్చని పేర్కొంది. జనవరి నుంచి మూడవ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష ప్రారంభం కానుంది. అయితే, అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవటం తో పాటుగా పరీక్ష కు హాజరయ్యే అభ్యర్దులకు ఎన్టీఏ కీలక సూచనలు జారీ చేసింది.
యూజీసీ - నెట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. అభ్యర్ధులు అధి కారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్ తో పాటుగా, జన్మదినం..సెక్యూరిటీ పిన్ నెంబర్ తో సహా కోరిన సమాచారం ఇవ్వటం ద్వారా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో జనవరి 3వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున నెట్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు వివరాలను యూజీసీ వెల్లడించింది.

85 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, విశ్వ విద్యా లయా ల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు యేటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తారు. ఇక, ఈ సంవత్సారినికి సంబంధించిన రెండో పరీక్షను జనవరి 3వ తేదీ నుంచి నిర్వహించాలని ఎన్టీయే నిర్ణయించింది. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్ల లో నిర్వహించనున్నారు. రెండు పేపర్లలోనూ ఆబ్జెక్టివ్ తో పాటుగా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ప్రశ్నా పత్రాలు ఉంటాయి.
తొలి పేపర్ తో అర్హత సాధించిన వారికే రెండో పేపర్ కు పరిగణలోకి తీసుకోనున్నారు. పేపర్ - 2లో 200 మార్కులకు నిర్వహించే పరీక్ష ను మూడు గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కొద్ది నెలల క్రితం నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షల వేళ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో, ఈ సారి లీకేజీలకు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఏ వెల్లడించింది.












Click it and Unblock the Notifications