ఎన్టీపీసీ లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: వెంటనే అప్లై చేయండి, మంచి జీతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)లిమిటెడ్‌లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పలు విభాగాల్లో మొత్తం 66 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఇటీవల అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తోంది.
అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో ఎలక్ట్రికల్ ఎరెక్షన్ విభాగంలో 12 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉండగా, మెకానికల్ ఎరెక్షన్‌లో 30, సివిల్ కన్‌స్ట్రక్షన్‌లో 24 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు:
సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి:
అభ్యర్థులు వయస్సు 35 ఏళ్లకు మించరాదు.
జీతం:
నెలకు రూ. 60,000- రూ. 1,80,000
ఎంపిక ప్రక్రియ:
స్క్రీనింగ్ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ. 300(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).
ఇతర వివరాలు, అప్లై చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
https://careers.ntpc.co.in/recruitment/login.php












Click it and Unblock the Notifications