తెలంగాణ గురుకులాల్లో మరో 2వేలకుపైగా పోస్టులు ఖాళీ: త్వరలో భర్తీ

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో తీపి కబురు ఇది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య పెరగనుంది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో మరో 2వేలకుపైగా పోస్టులు జత కానున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో తీపి కబురు ఇది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య పెరగనుంది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో మరో 2వేలకుపైగా పోస్టులు జత కానున్నాయి. త్వరలోనే జారీ చేయనున్న గురుకుల నియామక ప్రకటనల్లో భాగంగా వాటిని నింపేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి సొసైటీలు.

ప్రస్తుతం గురుకులాల్లో భర్తీకి 11,012 పోస్టులకు అనుమతులు లభించాయి. తాజా పోస్టులతో 13 వేలకుగాపై ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కొత్తగా మంజూరయ్యే ఎస్సీ, ఎస్టీ గురుకులాల పోస్టులు వీటితోపాటు భర్తీ చేయనున్నారు. కాగా, సంక్షేమ గురుకులాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 9096 ఉద్యోగాలను ప్రకటించింది.

Over 2000 posts to fill in Telangana gurukulas in soon

2022-23 విద్యా సంవత్సరానికి బీసీ సొసైటీ పరిధిలో కొత్తగా 33 బీసీ గురుకుల స్కూల్స్, 15 బీసీ డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. వాటికి సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో జనవరిలో బీసీ గురుకుల సొసైటీలో 2591 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది.

తాజాగా గుర్తించిన 2వేలకుపైగా పోస్టులను గుర్తించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత వీటి భర్తీకి కూడా చేయనున్నారు. మరోవైపు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో గురుకులాల బోధన పోస్టుల భర్తీ నిలిచిపోయింది. కోడ్ ముగిసే సమమానికి ఈ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలకు అనుమతులు వస్తే.. వీటన్నింటినీ కలిపి ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+