Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PMIS Internship: యువతకు ప్రతి నెలా రూ.5000 .. ఇప్పుడే అప్లై చేసుకోండి

గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని యువతకు నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025. ఈ స్కీమ్ ద్వారా పేద, మధ్య తరగతి యువతీయువకులకు తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఉచితంగా నైపుణ్యాలు నేర్పిస్తారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కూడా అందిస్తారు. అయితే తాజాగా ఈ స్కీమ్ రిజిస్ట్రేషన్ తేదీని మరోసారి పొడిగించారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు తమకు అర్హత, ఆసక్తి ఉన్న విభాగంలో ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యాప్ ఆవిష్కరణ అనంతరం పేర్కొన్నారు.

పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025 లక్ష్యం ఏంటంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మందికి ఇంటర్నెట్ షిప్ అవకాశాలను కల్పించాలి. అధికశాతం గ్రామీణ ప్రాంతాల్లోని యువతకే ఎక్కువ ఛాన్స్ ఇస్తారు. ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేదిగా ఉంది. ఆసక్తి కలిగిన యువత ఈలోపే అప్లై చేసుకోవడం ఉత్తమం. ఇక ఇంటర్న్ షిప్ సమయంలో పలు కంపెనీలు స్టైఫెండ్ కూడా అందిస్తాయి. అంతేకాక ఇంటర్న్ షిప్ అనంతరం సర్టిఫికేట్ సైతం లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ తో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఏడాదిపాటు శిక్షణ..

ఈ స్కీమ్‌కు ఎంపికైన అభ్యర్ధులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ.5 వేల చొప్పున స్టైపెండ్‌ ఇస్తారు. దీనితో పాటు కంపెనీలో చేరే ముందు రూ.6,000 లను వన్ టైమ్ గ్రాంట్ కింద అందజేస్తారు. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.66 వేలు పొందుతారు. ఏడాదిలో మొదటి ఆరు నెలలు క్లాస్‌ రూమ్ లో శిక్షణ.. మిగిలిన 6 నెలలు ఫీల్డ్‌లో శిక్షణ అందిస్తారు.

PM Internship Scheme 2025 Skill Training and Rs 5 000 Stipend for Youth Apply Now

ఆసక్తి ఉన్న యువతీయువకులు పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025 యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం రిజిస్టర్ కావాలి. ఆ తర్వాత వ్యక్తిగత, విద్యా సమాచారం అందించాలి. అనంతరం సంబంధిత సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ సెండ్ చేయాలి. ఇక ఎవరైతే ఇంటర్వ్యూకు ఎంపిక అయ్యారో వారి మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. సెలెక్ట్ అయ్యారో వారికి నోటిఫికేషన్ రూపంలో సమాచారం తెలుస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+