Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Post Office Jobs: పోస్టాఫీస్ ఉద్యోగాలకు అప్లై చేశారా? ఇవాళ,రేపు లాస్ట్ ఛాన్స్ ..!

తెలుగు రాష్ట్రాల్లో పోస్టాఫీసుల్లో (post office jobs) పోస్టు మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ్ డాగ్ సేవక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఓ అప్డేట్. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు తమ అప్లికేషన్లలో ఏవైనా తప్పులు చేసి ఉంటే వాటిని సవరించుకునేందుకు తపాలాశాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. పేర్లు, అడ్రస్ లు, కులం, ఇతర వివరాల్లో ఏవైనా తప్పిదాలు చేసుకుని ఉంటే అభ్యర్ధులు ఆన్ లైన్ లో వాటిని సవరించుకోవచ్చు.

అప్లికేషన్ సమయంలోనే ఆన్ లైన్ లో కరెక్షన్స్ విండో పేరుతో ఓ ఆప్షన్ ఆన్ లైన్ లో కనిపిస్తుంది. దాన్ని ఇవాళ యాక్టివ్ చేస్తారు. ఇందులో ఇప్పటికే అప్లికేషన్స్ లో తప్పులు, పొరబాట్లు చేసిన వాళ్లు ఎవరైనా ఉంటే వారు సరిచేసుకోవచ్చు. ఇందుకోసం ఎడిట్/కరెక్షన్ విండో ఇవాళ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత తమ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మార్పులు, చేర్పులు చేసుకుని తర్వాత అప్లికేషన్ ను సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఇవాళ, రేపు సమయం ఇచ్చారు. రేపు సాయంత్రం ఐదు గంటలతో ఈ సమయం ముగుస్తుంది.

Post Office Jobs Last Chance Today amp amp Tomorrow for BPM ABPM GDS Application Corrections

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు నేరుగా https://indiapost.gov.in/gdsonlineengagement లింక్ ను క్లిక్ చేస్తే అక్కడ ఎడిట్ లేదా కరెక్షన్ విండో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ వివరాలు వస్తాయి. అందులో వాటిని సరిచేసుకోవచ్చు. ా తర్వాత అప్లికేషన్స్ ను పైనల్ చేస్తారు. ఈ నెల 28న ఎంపికైన వారికి ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఆ తర్వాత వారు ఫిజికల్ గా సర్టిఫికెట్లు సమర్పించి తమ ఉద్యోగాలు ఖరారు చేసుకోవచ్చు.

Post Office Jobs Last Chance Today amp amp Tomorrow for BPM ABPM GDS Application Corrections

పోస్టాఫీసుల్లో గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) ఉద్యోగాలు అన్నీ కలిపి ఏపీలో 1060, తెలంగాణలో 608 పోస్టులు ఉన్నాయి. వీటిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి రూ.12 వేల నుంచి మొదలుపెట్టి గరిష్టంగా రూ.29,380 వరకూ జీతంగా చెల్లిస్తారు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా జీడీఎస్ ఉద్యోగానికి రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.24,270 వరకూ జీతంగా చెల్లిస్తారు. ఏటా 3 శాతం జీతాల పెంపు ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+