PGCIL Jobs:పవర్ గ్రిడ్‌లో ఉద్యోగాలు..అర్హతలు ఇవే..!!
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన ప్రకారం ఆఫీసర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ భర్తీ డిసెంబర్‌లో జరిగే యూజీసీ నెట్ ద్వారా భర్తీ చేస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే ఉంటుంది.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోస్టులకు దరఖాస్తు ప్రారంభ తేదీ 4 డిసెంబర్ 2024కు కాగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ 24 డిసెంబర్ 2024. ఈ పోస్టుకు అర్హులో కాదో అని తెలియపరిచే కట్ ఆఫ్ డేట్ చివరి తేదీ కూడా 24 డిసెంబర్ 2024.

24 డిసెంబర్ 2024నాటి కల్లా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించి ఉండరాదు.అయితే నిబంధనలను అనుసరించి వయసు పరిమితి పై రిలాక్సేషన్ ఉంటుంది. ఇక పోస్టుల వివరాల విషయానికొస్తే ఆఫీసర్ ట్రైనీ (ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్) ఆఫీసర్ ట్రైనీ (సోషల్ మేనేజ్‌మెంట్, ఆఫీసర్ ట్రైనీ (హెచ్‌ఆర్) ఆఫీసర్ ట్రైనీ (పీఆర్)లు ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
* ఆఫీసర్ ట్రైనీ (ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్)-14 పోస్టులు
* ఆఫీసర్ ట్రైనీ (సోషల్ మేనేజ్‌మెంట్)- 15 పోస్టులు
* ఆఫీసర్ ట్రైనీ (హెచ్‌ఆర్)-37 పోస్టులు
* ఆఫీసర్ ట్రైనీ (పీఆర్)-07 పోస్టులు
అర్హతలు:
. ఇక ఆఫీసర్ ట్రైనీ (ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్)కు అర్హత ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి
. ఆఫీసర్ ట్రైనీ (సోషల్ మేనేజ్‌మెంట్)- సోషల్ వర్క్‌లో పీజీ చేసి ఉండాలి.
. ఆఫీసర్ ట్రైనీ (హెచ్ఆర్)- సంబంధిత సబ్జెక్టులో పీజీ డిప్లొమా/డిగ్రీ/ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి
. ఆఫీసర్ ట్రైనీ (పీఆర్) ఏదైనా డిగ్రీ లేదా పీజీ డిప్లొమా లేదా మాస్ కమ్యూనికేషన్/పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
ఇక జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500/-గా నిర్థారించడం జరిగింది.ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.












Click it and Unblock the Notifications