భారీ జీతంతో ప్రసార భారతిలో ఉద్యోగాలు.. DON'T MISS !!
భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ అయిన ప్రసార్ భారతి గుడ్ న్యూస్ ప్రకటించింది. కాపీ ఎడిటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన ఉండగా.. మొత్తం 29 ఖాళీలను ఒక సంవత్సర కాలానికి భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీతో పాటు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ లేదా వీటికి సమానమైన స్పెషలైజేషన్‌లో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
భాషా పరిజ్ఞానం & వయోపరిమితి..
అంతే కాకుండా హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉండటంతో పాటు, పని చేయాల్సిన ప్రాంతానికి అనుగుణంగా ఉన్న ప్రాంతీయ భాషపై సమగ్రమైన అవగాహన కూడా అవసరమని వివరించింది. దరఖాస్తుదారుల గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు మించకూడదని పేర్కొన్నారు. నవంబర్ 11, 2025న విడుదలైన ఈ ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అవసరమైన పత్రాలు, అనుభవ ధృవపత్రాలు, వివరాలు సక్రమంగా అప్‌లోడ్ చేయాలని సూచించారు.

మొత్తం పోస్టులు..
29 ( దూరదర్శన్ - 21, ఆకాశవాణి - 8 )
ఎక్కడెక్కడ ? ఎన్ని పోస్టులంటే ??
RNU / DDK / AIR ప్రకారం పోస్టులు:
బెంగళూరు - 02
చండీగఢ్ - 03
హైదరాబాద్ - 01
ఇంఫాల్ - 03
ఇటానగర్ - 02
జమ్మూ - 01
కోహిమా - 03
కోల్‌కతా - 03
లేహ్ - 03
ముంబై - 01
పణాజీ - 03
రాంచీ - 01
తిరువనంతపురం - 03
ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థులను పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. Shortlisted అభ్యర్థులకు మాత్రమే e-mail ద్వారా సమాచారం అందుతుంది.
జీతం..
ఈ పోస్టులకు నెలకు రూ.35,000 (Fixed Salary) అందుతుంది. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ పోస్టు కాబట్టి అదనపు అలవెన్సులు లేవు.
ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఇమెయిల్ ద్వారా తదుపరి దశల సమాచారం అందుతుంది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా నిర్వహించబడుతుందని ప్రసార్ భారతి తెలిపింది.
పని ప్రదేశం & ఉద్యోగ నిబంధనలు..
ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసార భారతి కార్యాలయాల్లో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఉద్యోగ కాలం ఒప్పంద ప్రాతిపదికన ఉన్నప్పటికీ, ప్రదర్శన ఆధారంగా ఒప్పందం పొడిగించే అవకాశం కూడా ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
దరఖాస్తు విధానం..
Prasar Bharati Copy Editor Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక లింక్ ఓపెన్ చేయండి: https://avedan.prasarbharati.org
- Online Application Form పూర్తి చేయండి
- అవసరమైన పత్రాలు స్పష్టంగా upload చేయండి
- Submit చేసిన తర్వాత acknowledgement save చేసుకోండి












Click it and Unblock the Notifications