RRB Exams 2024: ఆర్ఆర్‌బి 41500 ఉద్యోగాలు.. పరీక్ష తేదీలు వెల్ల‌డి..

దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 41500 ఉద్యోగాల‌కు ఆర్ఆర్‌బి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ విడుద‌ల‌య్యింది. ఇక‌, ఈ పరీక్షలన్నీ నవంబర్, డిసెంబర్ నెలలోనే జ‌ర‌గనున్నాయి. ఆర్ఆర్‌బి అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్‌పిఎఫ్‌, టెక్నిషియ‌న్‌, జూనియ‌ర్ ఇంజినీర్ వంటి ప‌రీక్ష‌ల‌న్నీ సిబిటి విధానంలోనే ఉంటాయ‌ని అధికారులు తెలిపారు.

ఈ మేర‌కు ఆర్ఆర్‌బి ఓ ప్ర‌క‌ట‌న‌ను కూడా విడుద‌ల చేసింది. పరీక్షకు పది రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్, ఆడ్మిట్‌కార్డు వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చ‌న్నారు. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు నాలుగు రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని రైల్వే డిపార్ట్ మెంట్ తెలిపింది. రైల్వే శాఖ నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌కు ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ తప్పనిసరి కాబట్టి అభ్యర్థులు త‌మ ఒరిజినల్ ఆధార్ కార్డు ను తీసుకురావాల్సి ఉంటుంది.

RRB Exams 2024 RRB 41500 jobs Exam dates announced

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 41500 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఇందులో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్, 452 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్‌), 14,298 టెక్నీషియన్ పోస్టులు, 7951 జూనియర్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ పోస్టులన్నీ సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఉన్నాయి. అభ్యర్థులు ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం https://www.rrbapply.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+