RRB JE 2024 : రైల్వేలో ఉద్యోగాలు..7951 జేఈ, సూపర్​ వైజర్​ పోస్టులకు నోటిఫికేష‌న్‌..

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభ‌వార్త‌.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా ఓ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న‌అన్ని రీజియన్లలో ఆర్ఆర్‌బీ 7,951 పోస్టుల భర్తీకి ద‌రఖాస్తులు స్వీక‌రిస్తోంది. ఇందులో కెమికల్ సూపర్వైజర్ / రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ / రీసెర్చ్ పోస్టులు 17 ఉండ‌గా, జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు 7934 ఉన్నాయి. ఈ పోస్టులు కేవలం ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ పరిధికి చెందినవి మాత్ర‌మే. ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేయాల‌నుకునేవారు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ పాసైన వారు కూడా అర్హులే. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునేవారు 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 36 ఏళ్లలోపు వయసు క‌లిగి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వయో సడలింపు వ‌ర్తిస్తుంది. అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు rrbald.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

ద‌ర‌ఖాస్తు చేసుకునే తేదీలివే..

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ జులై 30 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. దరఖాస్తులో సవరణలను చేసుకునేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 8 వరకు అవకాశం ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లు, ఎస్టీ,ఎస్సీలయితే ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.250 చెల్లించాలి.

RRB JE 2024 Jobs in Railways Notification for 7951 JE Supervisor Posts

పోస్టులున్న ప్రాంతాలివే..

సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ పోస్టులున్నాయి.

వేత‌నం..

జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగాల‌కు ఎంపిక‌యిన అభ్య‌ర్థుల‌కు ప్రతినెలా రూ.35,400 ప్రారంభ వేతనం అంద‌జేస్తారు. కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ ఉద్యోగాల‌కు ఎంపిక‌యిన ఉద్యోగుల‌కు నెల‌కు రూ.44,900 ప్రారంభ వేతనం ఉంటుంది.

ప‌రీక్షా విధానం..

ఈ పోస్టుల‌కు స్టేజ్‌-1, స్టేజ్‌-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ), దృవ‌ప‌త్రాల ప‌రిశీల‌న, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టేజ్ 1 ప‌రీక్ష‌లో క్వాలిఫై అయిన వారు మాత్ర‌మే స్టేజ్ 2 ప‌రీక్ష‌కు అర్హులు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+