RRB : ఆర్‌పిఎఫ్ పరీక్ష సిటి ఇంటిమేషన్ స్లిప్పులు వచ్చేసాయ్..
ఆర్ఆర్‌బి ఇటీవలే రైల్వే ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్)లో ఎస్ఐ పోస్టుల నియామక రాత పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను ఆర్ఆర్‌బి తాజాగా విడుదల చేసింది. ఆర్‌పిఎఫ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, యూజర్ పాస్‌వర్డ్/ పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోగలరు.
సిటి ఇంటిమేషన్ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, మార్గదర్శకాలు వంటి సమాచారం ఉంటుంది. త్వరలోనే ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆర్ఆర్‌బి తాజాగా విడుదల చేయనున్నది. వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 452 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు గత మే మాసంలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు డిసెంబర్ 2, 3, 9, 12, 13 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, ధృవపత్రాల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రైల్వే శాఖ నిర్వహించే ఈ పరీక్షలకు ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ తప్పనిసరి. కాబట్టి అభ్యర్థులు అందరూ పరీక్షా కేంద్రానికి తమ ఒరిజినల్ ఆధార్ కార్డు ను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.
452 ఆర్‌పిఎఫ్ పోస్టులు..
దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 41500 ఉద్యోగాలకు ఆర్ఆర్‌బీ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సుమారు 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు ఉండగా, 452 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) పోస్టులు, 14,298 టెక్నీషియన్ పోస్టులు, 7951 జూనియర్ ఇంజినీర్ పోస్టులు ఖాళీలున్నాయి. ఇక, ఈ పోస్టులన్నీ సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఉన్నాయి. అభ్యర్థులు సిటి ఇంటిమేషన్ స్లిప్పులు డౌన్‌లోడ్‌తో పాటు ఇతర పూర్తి సమాచారం కోసం https://www.rrbapply.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.












Click it and Unblock the Notifications