RRC WCR 2024 : ఎటువంటి రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ లేకుండానే.. రైల్వేలో 3317 ఉద్యోగాలు..

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఎటువంటి రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ లేకుండానే వెస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో భారీ నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా డబ్ల్యూసీఆర్ విభాగాల్లోని డివిజన్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ నిమిత్తం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వెస్ట్ సెంట్ర‌ల్ రైల్వే నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

అర్హ‌త‌, అస‌క్తి క‌లిగిన అభ్యర్థులంతా ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 3317 యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌స్టు 5 నుంచే ప్రారంభ‌మైంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగ‌ల‌రు. అభ్యర్థులు ఇత‌ర పూర్తి వివరాల కోసం https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

RRC WCR 2024 3317 jobs in Railways without any written test or interview

ఖాళీగా ఉన్న యూనిట్‌లు, డివిజ‌న‌ల్‌లు...

సీఆర్‌డబ్ల్యూఎస్‌ బీపీఎల్‌, డబ్ల్యూఆర్‌ఎస్‌ కోటా, జేబీపీ డివిజన్, బీపీఎల్‌ డివిజన్, కోటా డివిజన్, హెచ్‌క్యూ/ జేబీపీ డివిజన్లు/యూనిట్‌లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హ‌త : ఈ పోస్టుల‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ప‌దో తరగతి, ప‌న్నెండో తరగతి ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వ‌య‌సు : ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్యర్థుల 05.08.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న‌వారై ఉండాలి.

ఎంపిక చేయు విధానం : ప‌దో తరగతి, ప‌న్నెండో తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా వీటికి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము : ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.41 చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు అయితే రూ.141 చెల్లించాలి. ఆన్‌లైన్‌ విధానంలో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చెల్లించాలి.

ట్రేడ్‌లు : బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+