రూ. 1,77,500 జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట (SDSC SHAR) గోల్డెన్ ఛాన్స్ ప్రకటించింది. మొత్తం 141 పోస్టుల భర్తీకి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2025 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 14, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
భారీ జీతంతో శాస్త్ర, సాంకేతిక రంగాలలో కెరీర్ కొనసాగించాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెబుతున్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో పనిచేసే ఛాన్స్ మిస్ చేసుకోకండి.

మొత్తం పోస్టులు..
141
ఖాళీల వివరాలు..
- సైంటిస్ట్/ఇంజినీర్ - SC: 23 పోస్టులు
- టెక్నికల్ అసిస్టెంట్: 28 పోస్టులు
- సైంటిఫిక్ అసిస్టెంట్: 3 పోస్టులు
- లైబ్రరీ అసిస్టెంట్ - A: 1 పోస్టు
- రేడియోగ్రాఫర్ - A: 1 పోస్టు
- టెక్నీషియన్ - B: 70 పోస్టులు
- డ్రాఫ్ట్స్‌మెన్ - B: 2 పోస్టులు
- కుక్: 3 పోస్టులు
- ఫైర్‌మెన్ - A: 6 పోస్టులు
- లైట్ వెహికిల్ డ్రైవర్ - A: 3 పోస్టులు
- నర్స్ - B: 1 పోస్టు
విద్యార్హతలు..
వివిధ పోస్టులకు అనుగుణంగా విద్యార్హతలు నిర్ణయించారు.
- సైంటిస్ట్/ఇంజినీర్ - SC పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎం టెక్ అర్హత ఉండాలి.
- టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్ పోస్టులకు డిప్లొమా లేదా బీఎస్సీ అర్హత ఉండాలి.
- టెక్నీషియన్ - B, డ్రాఫ్ట్స్‌మెన్ - B పోస్టులకు ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరి.
- కుక్, డ్రైవర్, ఫైర్‌మెన్ పోస్టులకు పదవ తరగతి పాస్, అలాగే అనుభవం అవసరం.
- నర్స్ - B పోస్టుకు డిప్లొమా ఇన్ నర్సింగ్ అర్హత కావాలి.
వయోపరిమితి..
2025 నవంబర్ 14 నాటికి వయస్సు ఇలా ఉండాలి:
- సైంటిస్ట్/ఇంజినీర్ - SC పోస్టులకు 18 నుండి 30 ఏళ్ల మధ్య
- మిగిలిన పోస్టులకు 18 నుండి 35 ఏళ్ల మధ్య
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల సడలింపు
SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు
దివ్యాంగులకు (PwBD) పదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
జీతభత్యాలు..
ISRO SDSC SHARలో జీతాలు కేంద్ర ప్రభుత్వ 7వ వేతన కమిషన్ ప్రామాణికాల ప్రకారం ఉంటాయి.
- సైంటిస్ట్/ఇంజినీర్ - SC: రూ.56,100 - రూ.1,77,500 నెలకు
- టెక్నికల్ అసిస్టెంట్ / సైంటిఫిక్ అసిస్టెంట్ / లైబ్రరీ అసిస్టెంట్: రూ.44,900 - రూ.1,42,400 నెలకు
- రేడియోగ్రాఫర్ - A: రూ.25,500 - రూ.81,100
- టెక్నీషియన్ - B / డ్రాఫ్ట్స్‌మెన్ - B: రూ.21,700 - రూ.69,100
- నర్స్ - B: రూ.44,900 - రూ.1,42,400
- కుక్ / డ్రైవర్ / ఫైర్‌మెన్ - A: రూ.19,900 - రూ.63,200 నెలకు
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్
అభ్యర్థులు SDSC SHAR అధికారిక వెబ్‌సైట్ https://www.shar.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు..
సాధారణ/OBC/EWS అభ్యర్థులకు రూ.500-రూ.750 (పోస్టును బట్టి మారుతుంది)
SC/ST, PwBD, Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం..
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
ఎంపిక ప్రక్రియ..
పోస్టును బట్టి వేర్వేరు దశల్లో ఉంటుంది.
- సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ
- టెక్నికల్, సైంటిఫిక్ అసిస్టెంట్లు, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
- కుక్, డ్రైవర్, ఫైర్‌మెన్ పోస్టులకు ఫిజికల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ నిర్వహించబడుతుంది.
ఎంపికైన అభ్యర్థులకు శ్రీహరికోట, నెల్లూరు జిల్లా, లేదా ఇతర ISRO కేంద్రాల్లో నియామకం అవకాశం ఉంటుంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications