ఏడాది రూ.20 లక్షల జీతంతో ఎస్బీఐలో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే !
భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బంపర్ అవకాశాన్ని అందించింది. స్పెషలిస్ట్ కాడర్ ఆఫీసర్ (Specialist Cadre Officer - SCO) పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా అక్టోబర్ 27, 2025 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవ్వగా.. నవంబర్ 17, 2025 తో ముగియనుంది.
కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. అందుకు అధికారిక వెబ్‌సైట్: https://sbi.bank.in ను సంప్రదించవచ్చు. గడువు తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం పోస్టులు..
SBI మొత్తం 103 స్పెషలిస్ట్ కాడర్ ఆఫీసర్ (SCO) పోస్టులను భర్తీ చేయనుంది.
ఖాళీల వివరాలు..
హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్ & రీసెర్చ్) - 1
జోనల్ హెడ్ (రిటైల్) - 4
రీజినల్ హెడ్ (రిటైల్) - 7
రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) - 19
ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్ (IS) - 22
ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ - 46
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ - 2
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్) - 2
విద్యార్హత..
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
CA / MBA / PGDM / PG Diploma / CFA / CFP / NISM సర్టిఫికేషన్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
సంబంధిత పోస్టుకు సంబంధించిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ లేదా మేనేజ్‌మెంట్ ఫీల్డులో అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.
వయస్సు పరిమితి..
(01.01.2026 నాటికి) కనీసం 25 సంవత్సరాలు నుండి గరిష్టంగా 50 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
వయస్సు సడలింపు..
OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
PwBD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
వేతనం..
ఈ పోస్టులకు గాను వేతనాలు లక్షల్లో ఉండటం ఈ రిక్రూట్‌మెంట్ ప్రత్యేకత.
హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్ & రీసెర్చ్) - రూ.1.35 కోట్లు వరకు ( వార్షిక వేతనం )
జోనల్ హెడ్ (రిటైల్) - రూ.97 లక్షలు
రీజినల్ హెడ్ - రూ.66.40 లక్షలు
రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) - రూ.51.80 లక్షలు
ఇతర పోస్టులు - రూ.20.60 - రూ.44.50 లక్షల వరకు
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీతో పాటు ఇన్సెంటివ్‌లు, బోనస్‌లు, బ్యాంక్ సౌకర్యాలు కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం..
షార్ట్ లిస్టింగ్ (Shortlisting)
ఇంటర్వ్యూ (Interview - 100 మార్కులు)
CTC నెగోషియేషన్ (Salary Discussion)
ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు.
దరఖాస్తు ఫీజు..
UR / EWS / OBC - రూ.750
SC / ST / PwBD - ఫీజు లేదు
ఫీజు చెల్లింపు ఆన్‌లైన్ గేట్‌వే ద్వారా డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలి.
అవసరమైన పత్రాలు..
దరఖాస్తు సమయంలో అభ్యర్థులు కింది డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి:
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
సంతకం
విద్యార్హత సర్టిఫికేట్లు
అనుభవ ధ్రువపత్రాలు (ఉంటే)
వయస్సు రుజువు పత్రం
సూచనలు..
ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రయాణ ఖర్చు (TA/DA) ఇవ్వబడదు.
అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు, కాబట్టి జాగ్రత్తగా దరఖాస్తు చేయాలి.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications