రూ.1,26,100 జీతంతో SEBIలో ఉద్యోగాలు..!

సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్‌ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిరుద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 110 ఖాళీలను భర్తీ చేయనుంది. అభ్యర్థులు తమ అర్హతను బట్టి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎల్‌ఎల్‌బీ, పీజీ, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎస్‌, ఐసేడబ్ల్యుఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులందరూ అర్హులు. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫైనాన్షియల్ రెగ్యులేటరీ సంస్థల్లో ఒకటైన సెబీలో కెరీర్ ప్రారంభించేందుకు ఇది ఒక అరుదైన అవకాశంగా చెప్పొచ్చు. సంబంధిత విభాగాల్లో అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

sebi-notification-for-110-jobs-with-salary-of-rs-1-26-100

మొత్తం పోస్టులు..

110

ఖాళీల వివరాలు..

  • జనరల్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 56
  • లీగల్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 20
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 22
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 2
  • సివిల్‌ ఇంజినీరింగ్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 3
  • రిసెర్చ్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 4
  • అఫీషియల్‌ లాంగ్వేజ్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 3

విద్యార్హతలు..

  • జనరల్: ఏదైనా డిసిప్లిన్‌లో మాస్టర్స్ డిగ్రీ / 2 సంవత్సరాల పీజీ డిప్లొమా లేదా లా/ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ / CA / CFA / CS / ICWA
  • లీగల్: LLB డిగ్రీతో పాటు కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
  • ఐటీ: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా 2 సంవత్సరాల పీజీ కోర్సు
  • రిసెర్చ్: ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్, డేటా సైన్స్ వంటి విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ
  • అఫీషియల్ లాంగ్వేజ్: హిందీ లేదా హిందీ ట్రాన్స్‌లేషన్‌లో మాస్టర్స్, లేదా హిందీ సబ్జెక్టుతో ఇంగ్లీష్/సంస్కృతం/కామర్స్‌లో మాస్టర్స్
  • ఎలక్ట్రికల్ / సివిల్ ఇంజినీరింగ్: సంబంధిత బ్రాంచ్‌లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి

వయోపరిమితి..

  • 2025 సెప్టెంబర్ 30 నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము..

  • UR / OBC / EWS అభ్యర్థులు: రూ.1000 + 18% GST
  • SC / ST / PwBD అభ్యర్థులు: రూ.100 + 18% GST
  • అభ్యర్థులు ఈ ఫీజును ఆన్‌లైన్ విధానంలోనే చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ..

పోస్టుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.

  • Phase I - ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష
  • Phase II - మెయిన్ ఎగ్జామ్
  • Phase III - ఇంటర్వ్యూ
  • Phase IIలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అవసరమైతే సెబీ ఎంపిక విధానంలో మార్పులు చేయవచ్చు.

జీతభత్యాలు..

  • సెబీ గ్రేడ్-ఎ ఆఫీసర్‌గా ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. పే స్కేల్ రూ.62,500 - రూ.1,26,100 మధ్య ఉంటుంది.
  • అలవెన్సులు: డీఏ, హెచ్ఆర్ఏ, గ్రేడ్ అలవెన్స్, NPS, ఫ్యామిలీ, లోకల్, లెర్నింగ్, మెడికల్, ట్రావెల్, లంచ్ సబ్సిడీ వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలుగా ఉంటుంది.

దరఖాస్తు విధానం..

  • అభ్యర్థులు SEBI అధికారిక వెబ్‌సైట్ https://www.sebi.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • Careers → Vacancies సెక్షన్‌లో "Officer Grade A 2025" లింక్‌పై క్లిక్ చేయాలి.
  • కొత్త రిజిస్ట్రేషన్ చేసి, అవసరమైన వివరాలు నమోదు చేయాలి.
  • పాస్‌పోర్ట్ ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి.
  • ఫీజు చెల్లించి, ఫారం సబ్మిట్ చేయాలి.
  • సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.

దరఖాస్తు గడువు..

ఆన్‌లైన్ దరఖాస్తుల లింక్ 2025 అక్టోబర్ 30 నుండి యాక్టివ్ అవుతుంది. ఫీజు చెల్లింపు, పరీక్ష తేదీలు, సిలబస్‌ వంటి వివరాలు డీటైల్డ్ నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాల కోసం https://www.sebi.gov.in/sebiweb/other/careerdetail.jsp?careerId=391 ఈ వెబ్ సైట్ సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+