సింగరేణిలో 327 ఉద్యోగాలు: దరఖాస్తు తేదీల్లో మార్పు, ఎప్పట్నుంచంటే?
సింగరేణి (Sinagareni) సంస్థలో 327 పోస్టుల భర్తీకి మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఉద్యోగాలకు మొదట ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్న అధికారులు.. ఆ తేదీల్లో మార్పు చేశారు. వివిధ కారణాల ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలిపారు.
తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మే 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 4 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో మేనేజ్ మెంట్ ట్రైనీ(ఈఅండ్ఎం) ఈ2 గ్రేడ్-42, మేనేజ్ మెంట్ ట్రైనీ(సిస్టమ్స్) ఈ2 గ్రేడ్-7.
నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో..
జూనియర్ మైనింగ్ ఇంజినీరు టీఅండ్ఎస్ గ్రేడ్ సీ-100, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ(మెకానికల్) టీఅండ్ఎస్ గ్రేడ్ సీ-9, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) టీఅండ్ ఎస్ గ్రేడ్ సీ-24, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1-47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరి -1-98 చొప్పున భర్త చేయనున్నారు.
అభ్యర్థల వయస్సు 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులైన అభ్యర్థులకు ఐదేళ్లపాటు వయో సడలింపు ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం సింగరేణి అధికారిక వెబ్‌సైట్ https://scclmines.com/scclnew/index.asp సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications