ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. 1394 ఉద్యోగాలు !
నిరుద్యోగ యువతకు ఇది భారీ గుడ్ న్యూస్. దక్షిణ రైల్వే (Southern Railway) చెన్నైలో 3518 యాక్ట్ అప్రెంటీస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.6000 - రూ.7000 వరకు స్టైఫండ్ ఇస్తారు. అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు..
3518
యూనిట్ల వారీగా ఖాళీలు..
- క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్, పెరంబూర్ - 1394 పోస్టులు
- సెంట్రల్ వర్క్‌షాప్, గోల్డెన్ రాక్ - 857 పోస్టులు
- సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్‌షాప్ యూనిట్స్, పొడనూర్ - 1267 పోస్టులు

విద్యార్హత..
సంబంధిత ట్రేడ్‌లో 10th Class / ఇంటర్ / ITI పాస్ అయి ఉండాలి.
వయస్సు..
- 2025 జనవరి 1 నాటికి 15 నుండి 24 సంవత్సరాలు ఉండాలి.
- OBCలకు - 3 ఏళ్ల సడలింపు
- SC/STలకు - 5 ఏళ్ల సడలింపు
- PWDలకు - 10 ఏళ్ల సడలింపు
పోస్టుల లిస్ట్..
- ఫిట్టర్
- వెల్డర్
- పెయింటర్
- MLT (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్)
- కార్పెంటర్
- MMV (మెకానిక్ మోటార్ వెహికల్)
- MMTM (మెకానిక్ మిషిన్ టూల్ మెయింటెనెన్స్)
- మెషినిస్ట్
- టర్నర్
- ఎలక్ట్రీషియన్
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్
- వైర్‌మెన్
దరఖాస్తు గడువు..
2025 ఆగస్టు 25 నుంచి 2025 సెప్టెంబర్ 26 వరకు
సెలెక్షన్ ప్రాసెస్..
- అభ్యర్థుల విద్యార్హతలో సాధించిన మార్కులు (Merit List) ఆధారంగా ఎంపిక చేస్తారు.
- షార్ట్‌లిస్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
- ఎలాంటి రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఉండదు.
స్టైఫండ్..
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6000 - రూ.7000 స్టైఫండ్ అందుతుంది.
దరఖాస్తు ఫీజు..
- జనరల్ / OBC / EWS అభ్యర్థులు: రూ.100
- SC / ST / PWD అభ్యర్థులు: ఫీజు లేదు
దరఖాస్తు విధానం..
దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://sronline.etrpindia.com ను సంప్రదించవచ్చు.
సూచనలు..
- అభ్యర్థులు మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ యాక్టివ్‌గా ఉంచుకోవాలి, ఎందుకంటే అన్ని అప్‌డేట్స్ వాటి ద్వారానే వస్తాయి.
- దరఖాస్తులో ఇచ్చే డాక్యుమెంట్స్ స్పష్టంగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్‌లో మార్పులు చేయడం సాధ్యం కాదు.












Click it and Unblock the Notifications