SSC CGL 2024 : 17,727 ఉద్యోగాలకు.. రేపే లాస్ట్ డేట్..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 17,727 సిజిఎల్ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈ నెల 24న (రేపు) రాత్రి 11 గంటలతో ముగియనుంది. ఎస్ఎస్‌సి సిజిఎల్ఈ మొత్తం 17,727 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇక, ఈ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ పాసయిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, డివిజన్ అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్‌పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. వయసు పోస్టులను బట్టి 18 నుంచి 30 ఏళ్లు వయస్సున్న వారు ఈ పోస్టులకు అర్హులు. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేందుకు అభ్యర్థులు ఎస్ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ను సంప్రదించవచ్చు. ఈ ఉద్యోగాలకు టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపిక చేయు విధానం
ఈ పోస్టులకు టైర్-1, టైర్-2 పరీక్షలు, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్‌మెంట్స్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

టైర్-1 పరీక్ష విధానమిదే...
టైర్ 1 పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. 50 మార్కులు ఉంటాయి. టైర్ 1లో ఉత్తీర్ణత సాధించిన వారికి టైర్ 2 పరీక్ష ఉంటుంది. పరీక్షకు గంట సమయం ఇస్తారు. ఇందులో నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయాలనుకునే జనరల్ అభ్యర్థులు రూ.100ను దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు ఫీజు చెల్లించనక్కర్లేదు.
పరీక్షా కేంద్రాలు
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి,












Click it and Unblock the Notifications