SSC GD : భారీగా పెరిగిన కానిస్టేబుల్ (జీడీ) పోస్టులు.. త్వరలోనే ఫలితాలు
నిరుద్యోగులు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ అదిరిపోయే శుభవార్తను అందించింది. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల సంఖ్యను అమాంతం పెంచేసింది. ఈ మేరకు మొత్తం ఖాళీల వివరాలను సవరిస్తూ తాజాగా రివైజ్‌డ్ నోటీసును ఎస్ఎస్‌సి విడుదల చేసింది. గత సంవత్సరం నవంబర్‌లో 26,146 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ పోస్టులకు ఎస్ఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. తాజాగా ఆ నోటిఫికేషన్ సవరిస్తూ నోటీసును విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ సుమారు 20,471 పోస్టులను అదనంగా చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,617కి చేరింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా వివిధ సాయుధ బలగాల్లో మొత్తం 46,617 కానిస్టేబుల్ పోస్టులను ఎస్ఎస్‌సి భర్తీ చేయనుంది.
ఇక, ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ కూడా ఏప్రిల్ 3న విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలను కూడా ఎస్ఎస్‌సి స్వీకరించడం జరిగింది. ఇక, త్వరలోనే ఈ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ పోస్టులకు ఎంపికవ్వాలంటే రాత పరీక్ష అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక, ఈపోస్టుల్లో వివిధ కేటగీరీలు ఉన్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితోపాటు అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్‌లోనే భర్తీ చేయనున్నారు.

పెరిగిన మొత్తం పోస్టుల వివరాలు..
కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ)లో మొత్తం 46,617 పోస్టులు ఉన్నాయి.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్)లో మొత్తం 12,076 పోస్టులు ఉన్నాయి. ఇందులో పురుషులకు 10227 పోస్టులు, మహిళలకు 1849 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో మొత్తం 13,632 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో పురుషులకు 11,558 పోస్టులు, మహిళలకు 2,074 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లో 9,410 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో పురుషులకు 9,301 పోస్టులు, మహిళలకు 109 పోస్టులు ఉన్నాయి.
సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ)లో 1,926 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో పురుషులకు 1,884 పోస్టులు, మహిళలకు 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో 6,287 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో పురుషులకు 5,327 పోస్టులు, మహిళలకు 960 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో 2,990 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో పురుషులకు 2,948 పోస్టులు, మహిళలకు 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్)లో 296 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో పురుషులకు 222 పోస్టులు, మహిళలకు 74 పోస్టులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications