Staff Nurse Result : టీఎస్ స్టాఫ్‌నర్స్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల...
Staff Nurse Result : టీఎస్ స్టాఫ్‌నర్స్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల : టీఎస్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో 7,094 స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితా విడుదల అయ్యింది. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 18న విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఈ జాబితాను ప్రకటించినట్లు ఆయన వివరించారు.
అభ్యంతరాల పరిశీలన అనంతరం 9,000 మందితో కూడిన మెరిట్ జాబితాను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ డిసెంబర్ 28న విడుదల చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 30 నుంచి ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలనకు 70 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు తెలుస్తోంది. మొత్తం 7,094 స్టాఫ్‌నర్స్ పోస్టులకు గాను 40,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 38,674 మంది రాత పరీక్ష రాయగా, వారిలో నుంచి 8,892 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచినట్లు కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు.

డిసెంబర్ 30 నుంచి జనవరి 6 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ : సర్టిఫికెట్ వెరిఫికేషన్ శనివారం నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతి రోజూ 3 సెషన్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని ఆయన వివరించారు. మొదటి సెషన్ ఉదయం 9.15 నుంచి 11.15 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, మూడో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు. రాతపరీక్షలో సాధించిన మార్కులతో పాటు ప్రభుత్వ వైద్య సేవల అనుభవానికి ప్రత్యేకంగా పాయింట్లు కేటాయించనట్లు సమాచారం. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. అభ్యర్థులు మెరిట్ జాబితాను https://mhsrb.telangana.gov.in/ ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోగలరు.
ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ (ఈస్ట్), 120/పీ, సెయింట్ మైకేల్స్ కాలనీ, అభ్యుదయన గర్, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్ధులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లతోపాటు వాటికి సంబంధించి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను కూడా వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్‌ను కూడా తప్పనిసరిగా తీసుకురావాలి.












Click it and Unblock the Notifications