SSC CGL 2023: నిరుద్యోగులకు శుభవార్త.. 7,500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 3న ఎస్సెస్సీ సీజీఎల్(SSC CGL) నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ బి, గ్రూప్ సీ పోస్టుల కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు నిర్వహించనుంది. డిగ్రీ అర్హతపై ఈ ఉద్యోగాల కోసం ఏప్రిల్ 3 నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 4 వరకు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మే 7 నుంచి తమ దరఖాస్తులలో మార్పులు చేసుకోవచ్చు.
మే 8న వివిధ విభాగాల్లోని దాదాపు 7,500 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు.ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో అసిస్టెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరో సహా పలు శాఖల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పాటు పలు శాఖల్లో వివిధ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచు బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

టైర్ 1లో అబ్జెక్టివ్ టైప్, టైర్ 2 లో మూడు పేపర్లు ఉంటాయి. పరీక్షలన్నీ ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో కేంద్రాలు ఉండగా.. ఏపీలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications