25,487 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. DON'T MISS
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తీపి కబురు ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను 2025 డిసెంబర్ 31లోపు సమర్పించాలి. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలలో పురుషులకు 23,467 పోస్టులు కేటాయించగా.. మహిళలకు 2,020 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ నియామకాల ద్వారా వివిధ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), అస్సాం రైఫిల్స్, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లలో ఖాళీలను పూరించనున్నారు. రాష్ట్రాలు, పోలీస్ దళాల వారీగా పూర్తి ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో గమనించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

ఏ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలంటే..?
కాగా ఈ భర్తీలో భాగంగా పలు పోలీస్ దళాలలో నియామకాలు జరగనున్నాయి. వాటిలో..
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) - 14,595 పోస్టులు వీటిలో 13,135 పురుషులకు, 1,460 మహిళలకు కేటాయించారు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) - 5,490 ఖాళీలు ఉండగా.. పురుషులకు 5,366, మహిళలకు 124 పోస్టులు ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ (AR) - 1,706 జాబ్స్ కి గాను.. 1,556 పురుషులకు, 150 మహిళలకు కేటాయించారు.
సశస్త్ర సీమా బల్ (SSB) - మొత్తం 1,764 పోస్టులను కలిగి ఉండగా.. మొత్తం పురుష అభ్యర్థుల కోసం మాత్రమే ఉన్నాయి.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) - మొత్తం 1,293 పోస్టులకు పురుషులకు 1,099, మహిళలకు 194 కేటాయించారు.
సరిహద్దు భద్రతా దళం (BSF) - 616 ఖాళీలు ఉండగా.. 524 పురుషులకు, 92 మహిళలకు కేటాయించారు.
స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) - 23 పోస్టులు పూర్తిగా పురుష అభ్యర్థులకే రిజర్వ్ చేశారు.
విద్యార్హత..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి..
వయో పరిమితి విషయానికి వస్తే, 2026 జనవరి 1 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹21,700 నుండి ₹69,100 వరకు ఆకర్షణీయమైన మూల వేతనంతో పాటు, ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతర అలవెన్స్‌లు కూడా వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ..
ఈ కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియ నాలుగు ప్రధాన దశల్లో జరుగుతుంది.
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): ఇది ఆన్‌లైన్‌లో నిర్వహించే ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష. జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్/హిందీకి సంబంధించిన మొత్తం 80 ప్రశ్నలు 160 మార్కులు ఉంటాయి.
2. శారీరక సామర్థ్య పరీక్ష (PET): ఇందులో పరుగు పరీక్ష ఉంటుంది. పురుషులు 24 నిమిషాల్లో 5 కి.మీ దూరం, మహిళలు 8.5 నిమిషాల్లో 1.6 కి.మీ దూరం పరుగు పూర్తి చేయాలి.
3. శారీరక ప్రమాణాల పరీక్ష (PST): అభ్యర్థుల ఎత్తు, ఛాతీ, బరువు వంటి శారీరక కొలతలను పరీక్షిస్తారు.
4. వైద్య పరీక్ష: ఉద్యోగానికి శారీరకంగా, మానసికంగా సరిపోతారో లేదో నిర్ధారించడానికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం..
దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్ (https://ssc.gov.in) ను సందర్శించాలి.
అక్కడ 'నోటీస్ బోర్డ్' విభాగంలో "CAPFs లో కానిస్టేబుల్ (GD)..." అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
దరఖాస్తు చేయడానికి ముందు, నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి అర్హతలను ధృవీకరించుకోవాలి.
ఆపై 'అప్లై' లింక్‌ను క్లిక్ చేసి, కొత్త వినియోగదారులైతే ఆధార్ వివరాలతో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి దరఖాస్తు ఫారాన్ని నింపి, అవసరమైన పత్రాలైన ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
చివరిగా దరఖాస్తు రుసుము చెల్లించి, ఫామ్‌ను సమర్పించిన తర్వాత భవిష్యత్ సూచన కోసం ఒక ప్రింటవుట్ తీసుకోవడం మంచిది.
అభ్యర్థులు రాష్ట్రాల వారీగా ఖాళీల సంఖ్యతో పాటు, దరఖాస్తుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, ఇతర నిబంధనల వివరాల కోసం అధికారిక SSC GD 2025 నోటిఫికేషన్ PDFను తప్పనిసరిగా పరిశీలించాలని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది.
-
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!!












Click it and Unblock the Notifications