SSC JOBS : నెలకు రూ.1,50,000 వరకు జీతంతో ఉద్యోగాలు..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) విడుదల చేసిన ఫేజ్-XIV/2026 సెలక్షన్ పోస్టుల నోటిఫికేషన్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 20న ప్రకటించిన ఈ నోటిఫికేషన్‌లో తొలుత పేర్కొన్న 3003 ఖాళీలను సవరిస్తూ.. తాజాగా మొత్తం పోస్టుల సంఖ్యను 2,919కు తగ్గించారు. కొన్ని విభాగాల్లో కొత్త ఉద్యోగాలను చేర్చగా, మరికొన్నింటిని పూర్తిగా తొలగించడం ఈ మార్పులకు కారణమైంది.

ఖాళీలలో మార్పులు..

Defence Research and Development Organisation (DRDO)లో 104 కొత్త పోస్టులు జోడించబడ్డాయి. ఫైర్ ఇంజన్ డ్రైవర్ 'A', సెక్యూరిటీ అసిస్టెంట్ 'A' వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి.
ఇక Geological Survey of India (GSI)లోని 188 పోస్టులను రద్దు చేశారు. డ్రిల్లింగ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు ఈ జాబితాలో ఉన్నాయి.

staff-selection-commission-notification-for-different-posts-across-india-in-various-categories

అర్హతల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు..

10వ తరగతి అర్హత: ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్, స్టాఫ్ కార్ డ్రైవర్, కుక్, మెడికల్ అటెండెంట్

వేతనం: సుమారు ₹35,000 (లెవల్-1)

ఇంటర్మీడియట్ అర్హత: కాపీహోల్డర్, ఫీల్డ్ అసిస్టెంట్, క్లర్క్

వేతనం: సుమారు ₹40,000 (లెవల్-2)

డిప్లొమా అర్హత: జూనియర్ ఇంజనీర్ పోస్టులు

వేతనం: సుమారు ₹60,000 (లెవల్-6)

డిగ్రీ & పై స్థాయి: సబ్-ఇన్‌స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, నర్సింగ్ ఆఫీసర్

వేతనం: ₹50,000 - ₹80,000 వరకు

ఎంపిక విధానం..

కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT)

అవసరమైతే స్కిల్ టెస్ట్ / డాక్యుమెంట్ వెరిఫికేషన్

మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం & ముఖ్య తేదీలు..

దరఖాస్తు చివరి తేదీ: మే 4, 2026

ఫీజు చెల్లింపు గడువు: మే 5, 2026

అప్లికేషన్ సవరణ తేదీలు: మే 11 - 13, 2026

పరీక్షలు: జూన్ 2026లో జరిగే అవకాశం

అభ్యర్థులు తమ అర్హతకు తగ్గ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి పోస్టుకు విడిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు సమయంలో జాగ్రత్తలు..

ఫోటో, సంతకం స్పష్టంగా అప్‌లోడ్ చేయాలి

విద్యార్హత సర్టిఫికేట్లు సరైనవి ఉండాలి

ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత తప్పులు ఉంటే కరెక్షన్ విండోలోనే సవరించాలి

చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+