ఎస్‌బిఐలో 8773 క్లర్క్ పోస్టులు... వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 8773 క్లర్క్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్త‌యిన అభ్య‌ర్థులు ఎవ‌రైనా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం సాధించాల‌ని ప్ర‌తి ఒక్క‌రికి ఆశ ఉంటుంది. అందుకే ఎస్‌బిఐ నిరుద్యోగులకు ఈ శుభ‌వార్త‌ను మోసుకొచ్చింది. మొత్తం 8773 పోస్టుల‌కు గాను నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.

ఈ పోస్టుల‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యింది. కాబ‌ట్టి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునేవారు ఈ వివ‌రాల‌ను ముందుగా తెలుసుకుంటే మంచిది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌ విధానంలో ద‌రఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 17 నుంచి ప్రారంభమ‌య్యింది. అభ్యర్థులు డిసెంబర్‌ 7 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

State Bank of India has released a massive notification

విద్యార్హ‌త‌...
ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత క‌లిగి ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేసుకోవచ్చు.

వ‌య‌సు...
ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ప‌రీక్ష వివ‌రాలు..
ఈ పోస్టుల‌కు మూడంచెల ప‌రీక్ష విధానం ఉంటుంది. మొద‌ట‌గా ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణుల‌యిన వారు మెయిన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://sbi.co.in/web/careers ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

మొత్తం క్లర్క్‌ పోస్టుల వివరాలు - 8773

విద్యార్థత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనలియర్‌ విద్యార్థులు కూడా అర్హులే.
వయసు: అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేపడతారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభతేదీ: నవంబర్‌ 17, 2023
దరఖాస్తులకు చివరితేదీ : డిసెంబర్‌ 7, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sbi.co.in/web/careers

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+