నెలకు రూ.1,80,000 జీతంతో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే ??
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 124 మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెక్నికల్) పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఇది గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటుండగా..డిసెంబర్ 5, 2025 తో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియనుంది. ఇంకా కేవలం పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో.. ఆసక్తి గల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు వేతనం లభిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత ఈ జీతాన్ని నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు పెంచుతారు. వీటితో పాటు పెన్షన్ ప్రయోజనాలు, మెడికల్ సౌకర్యాలు, కుటుంబ భద్రత వంటి అనేక లాభాలను పొందవచ్చు. పదోన్నతిలో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, AGM / DGM, GM స్థాయి వరకు ఎదగవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం పోస్టులు..
124
ఖాళీల వివరాలు..
మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులను మొత్తం ఏడుకు పైగా విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీ వివరాలు..
- కెమికల్ ఇంజినీరింగ్
- సివిల్ ఇంజినీరింగ్
- కంప్యూటర్ సైన్స్ / ఐటీ
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
- ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్
- మెకానికల్ ఇంజినీరింగ్
- మెటలర్జీ ఇంజినీరింగ్
విద్యార్హత..
సంబంధిత ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే వారు ఆయా విభాగాల్లో 65% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ / పీజీ పూర్తి చేసి ఉండాలి.
వయసు అర్హత & సడలింపులు..
2025 డిసెంబర్ 5 నాటికి అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం:
SC / ST: 5 సంవత్సరాల సడలింపు
OBC (Non-Creamy Layer): 3 సంవత్సరాల సడలింపు
PwBD: 10 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు
Ex-Servicemen: నియమాల ప్రకారం ప్రత్యేక సడలింపు
ఎంపిక విధానం..
- అభ్యర్థుల ఎంపిక పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా జరుగుతుంది. SAIL ఇటీవల పరీక్షా విధానంలో కొన్ని మార్పులు చేసింది:
- CBTలో టెక్నికల్ సబ్జెక్ట్ ప్రశ్నలు ( జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, ఆప్టిట్యూడ్ )
- పరీక్ష వ్యవధి: సుమారు 2 గంటలు
- మైనస్ మార్కింగ్ ఉండే అవకాశం (అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టత)
- CBTలో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ / గ్రూప్ డిశ్కషన్ నిర్వహించబడే అవకాశం ఉంది.
- పరీక్షలు 2026 జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నిర్వహించబడతాయని అధికారుల సమాచారం.
దరఖాస్తు రుసుము..
- General / OBC / EWS: రూ.1050
- SC / ST / PwBD / Ex-servicemen: రూ.300
దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి.
అదనపు సమాచారం..
- CBT పరీక్ష అడ్మిట్ కార్డులు పరీక్షలకు 10 రోజులు ముందు విడుదల చేసే అవకాశముంది.
- ఎంపికైన అభ్యర్థులు బోకారో, భిలాయ్, రౌర్కెలా, సేలెం వంటి ప్రధాన స్టీల్ ప్లాంట్లలో పోస్టింగ్ పొందే అవకాశం.
- మహిళా అభ్యర్థులకు అన్ని విభాగాల్లో సమాన అవకాశాలు ఉన్నాయి.
- SAIL ఉద్యోగాలు అత్యధిక భద్రత, ఉన్నత వేతనాలు, అదనపు అలవెన్సులు ఉండటంతో పోటీ చాలా ఎక్కువగా ఉండొచ్చు.












Click it and Unblock the Notifications