Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెక్‌ ఉద్యోగులకు పెను ప్రమాదం: ఇండియా ఐటీ నిపుణులకు భారీ షాక్‌!

Tech Layoffs 2025: టెక్ ఇండస్ట్రీలో 2025లో కూడా భారీగా ఉద్యోగ కోతలు కొనసాగుతున్నాయి. 2024లో లక్షా 50 వేల ఉద్యోగాలు తొలగించగా.. ఈ ఏడాది ఇప్పటికే వందలాది కంపెనీలు.. లక్షలాది మందికి ఉద్యోగులను తొలగించాయి. ఏఐ సాంకేతికత, ఆటోమేషన్ కారణంగానే ఈ కోతలు జరుగుతున్నాయి. అదే సమయంలో కొత్త H-1B వీసా ఫీజులను గణనీయంగా పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇది విదేశీ టెక్ ఉద్యోగుల అవకాశాలపై ప్రభావం చూపవచ్చు.

ప్రముఖ టెక్ కంపెనీలలో ఉద్యోగాల కోతలు
మైక్రోసాఫ్ట్: ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది దాని ప్రపంచవ్యాప్త ఉద్యోగులలో 4 శాతం కంటే తక్కువ. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఈ సంస్థ ఉద్యోగులను తొలగించింది.

ఇంటెల్: చిప్ మేకర్ ఇంటెల్ కూడా 5,500 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. 2025 చివరి నాటికి మొత్తం 24,000 నుంచి 25,000 ఉద్యోగాలను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకుంది.

Tech Layoffs 2025 Massive Job Cuts and H-1B Visa Shock for Indian IT Professionals

సేల్స్‌ఫోర్స్: సేల్స్‌ఫోర్స్ తన కస్టమర్ సపోర్ట్ డివిజన్‌లో మరో 4,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం ఆ విభాగంలో ఏఐ ఏజెంట్లు దాదాపు ఒక మిలియన్ కస్టమర్ సంభాషణలను నిర్వహిస్తున్నాయి.

గూగుల్: గూగుల్ కూడా ఈ లేఆఫ్స్ వేవ్‌తో ప్రభావితమైంది. గూగుల్ కు చెందిన ఏఐ రేటింగ్ ప్రాజెక్టులను నిర్వహించే గ్లోబల్ లాజిక్ సంస్థ 200 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించింది. ఏఐ మోడల్స్ ను శిక్షణ ఇవ్వడానికి తమను వాడుకుని.. ఆ తర్వాత తొలగించారని ఈ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఒరాకిల్: అమెరికా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తోంది. ఇటీవలి రౌండ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కనీసం 254 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. భారతదేశం, కెనడా, ఐరోపాలోని ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం ఉంది.

ట్రంప్ కొత్త H-1B వీసా ఫీజు పెంపు
ఈ లేఆఫ్స్ మధ్యనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు, ఇది H-1B వీసా ఫీజులను గణనీయంగా పెంచుతుంది. కొత్త H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. ఈ చర్య అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద టెక్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించకుండా నిరుత్సాహపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల భారతీయ ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు పొందడం కష్టంగా మారనుంది. అయితే, ఈ కొత్త నియమాలు ప్రస్తుత H-1B వీసా హోల్డర్లకు లేదా రెన్యూవల్ కోరుకునేవారికి వర్తించవు. ఇది కేవలం భవిష్యత్తులో దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+