తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల: ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల ఫైనల్ కీ విడుదలైంది. ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేయగా.. దీనిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా, శుక్రవారం సాయంత్రం తుది కీ విడుదల చేశారు.
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీని స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా అధికారిక వెబ్‌సైట్ (https://tgdsc.aptonline.in/tgdsc/FinalKey)లో అందుబాటులో ఉంచారు. తుది కీ ప్రకారం అభ్యర్థులు ఎవరికి వారు తమకు పరీక్షల్లో వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు.
మరికొద్ది రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు.

డీఎస్సీ ఫైనల్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://ntvtelugu.com/news/telangana-dsc-2024-final-key-released-670750.html
సివిల్ అసిస్టెంట్ సర్జన్ మెరిట్ లిస్ట్ విడుదల
తెలంగాణలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) మెరిట్ జాబితాను శుక్రవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. మొత్తం 442 పోస్టులకు వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 4,850 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మెరిట్ జాబితాను విడుదలైంది. అభ్యంతరాలను శుక్రవారం నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు బోర్డు తెలిపింది. ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించింది.












Click it and Unblock the Notifications