తెలంగాణ ఈసెట్, లాసెట్ షెడ్యూల్ విడుదల: దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?

తెలంగాణ ఉన్నత విద్యామండలి2024-25 విద్యా సంవత్సరానికి గానూ లాసెట్​ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మూడేళ్ల, ఐదేళ్ల లా కామన్​ ఎంట్రెన్స్ టెస్ట్(TS LAWCET- 2024)​, పీజీ లా కామన్​ ఎంట్రెన్స్ టెస్ట్ సెట్​ (TS PGLCET- 2024) ప్రవేశపరీక్షలకు షెడ్యూల్​‌ను ఖారారు చేసింది.

ఎల్​ఎల్​బీ, ఎల్​ఎల్​ఎం పరీక్ష నిర్వహణకు ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌​లైన్​లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. జూన్ 3వ తేదీన టీఎస్ లా సెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

 Telangana ECET 2024, LAWCET schedule released.

ఈసెట్ షెడ్యూల్ విడుదల

మరోవైపు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈసెట్ షెడ్యూల్‌​ను విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఈసెట్(TS ECET-2024) నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు విద్యార్థులు ఈసెట్‌​కి ఆన్‌​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చునని స్ఫష్టం చేసింది.

రూ.500ల లేట్ ఫీజుతో ఏప్రిల్ 22 వరకు, 1000 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 28 వరకు ఆన్‌​లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించింది. మే 1 నుంచి విద్యార్థులు హాల్ ​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చని స్ఫష్టం చేసింది. మే 6వ తేదీన ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

తెలంగాణ నిరుద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. అయితే, వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి గ్రూప్‌- 1 నిర్వహిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు.

కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) ప్రక్షాళన ఆలస్యం అయ్యిందని సీఎం రేవంత్ తెలిపారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షించారన్న రేవంత్.. 15 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. జీరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్లం కాదని రేవంత్ రెడ్డి గత సర్కారుకు చురకలంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+