తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: భారీగా జీతం, అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణలోని 23 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడాది కాలంపాటు కాంట్రాక్టు విధానంలో పని చేసేందుకు ఈ రిక్రూట్‌మెంట్‌ను చేపబడుతోంది.
ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పొడిగిస్తారు. ఒకవేళ రెగ్యులర్ నియామకాలు చేపడితే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్రభుత్వ మెడికాల్ కాలేజీలు ఉండగా వాటిల్లో గాంధీ, ఉస్మానియా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలను మినహా.. మిగిలిన 23 కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్ రికొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట జీఎంసీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈ మెయిల్ ద్వారా ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైతే ఆగస్టు 24లోగా జాయినింగ్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
అంతేగాక, టీచింగ్ అనుభవం కూడాఉండాలి. అయితే రెగ్యులర్ ఉద్యోగులకన్నా వీరికి అధిక వేతనం ఇవ్వనున్నారు. ఎంపికైతే ప్రొఫెసర్‌కు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. అయితే, ఏదైనా కారణంతో మధ్యలో ఉద్యోగాన్ని వదిలేస్తే మూడు నెలల జీతాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications