గ్రేడ్ 1 ఎక్స్‌టెన్షన్ ఉద్యోగ ఫలితాలు విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వరుసగా పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాకు సంబంధంచిన ఫలితాలను విడుడదల చేస్తోంది. తాజాగా, మహిళా, శిశు సంక్షేమ శాఖ విభాగంలోని గ్రేడ్-1 ఎక్స్‌టెన్షన్ అధికారి ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసింది.
జనరల్ ర్యాంకులతోపాటు ఫైనల్ కీ విడుదల చేసింది. ఈ మేరకు మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ధృవపత్రాల పరిశీలన 1:2 నిష్ఫత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. అభ్యర్థులు మెరిట్ జాబితా కోసం టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చని అధికారులు సూచించారు.

గ్రేడ్ -1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జనవరి 8న పరీక్ష నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 26,751 మంది దరఖాస్తు చేసుకున్నారు. 16,729 మంది పరీక్షకు హాజరు అయ్యారు. ఇందులో 15,280 మంది మెరిట్ జాబితాలో చోటు సాధించారు. కాగా, ఇప్పటికే గ్రూప్1,2,3 మెరిట్ జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 7 ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది.
పోస్టుల వివరాలు:
అనాలసిస్ ఇంజినీర్: 01
డిజైన్ ఇంజినీర్ (మెకానికల్): 04
డిజైన్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01
డిజైన్ అసిస్టెంట్ (ఎలక్ట్రిక్): 01
అర్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్)తోపాటు పని అనుభవం.
వయో పరిమితి:
మార్చి 15, 2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
వేతనం:
నెలకు అనాలిసిస్ ఇంజినీర్‌కు రూ 60 వేలు
డిజైన్ ఇంజినీర్‌కు రూ. 50 వేలు
డిజైన్ అసిస్టెంట్‌కు రూ. 40 వేలు
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 4, 2025
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.
దరఖాస్తు పంపవలసిన చిరునామా:
డిప్యూటీ జనరల్ మేనేజర్/హెచ్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా తెలంగాణ - 502205.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://avnl.co.in/careers-vacancies సంప్రదించవచ్చు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications