తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల
తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) బుధవారం విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. డిస్క్రిప్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న భాషలోనే పరీక్ష రాసే వీలు కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ప్రతి పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా 895 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించారు. ఈ పరీక్షకు 4.03 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా.. 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. త్వరలోనే ప్రిలిమ్స్ కీ, ఫలితాలు విడుదల చేయనున్నారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే :
జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్) - అక్టోబర్ 21
పేపర్ 1(జనరల్ ఎస్సే) - అక్టోబర్ 22
పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ) - అక్టోబర్ 23
పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్) - అక్టోబర్ 24
పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్‌మెంట్) - అక్టోబర్ 25
పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్) - అక్టోబర్ 26
పేపర్ 6(తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) - అక్టోబర్ 27












Click it and Unblock the Notifications