తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి..!
తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 1 ఫలితాలతో పాటు తుదికీను కూడా టీజీపీఎస్‌సి తాజాగా విడుదల చేసింది. 1: 50 నిష్ఫత్తిలో గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ తెలిపింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21వ తేది నుంచి 27వ తేదివరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్‌సి తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందే అడ్మిట్‌కార్డులను విడుదల చేస్తామంది. ప్రిలిమనరీ మార్కలు కటాఫ్‌ను వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు టిజిపీఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌లోకి https://www.tspsc.gov.in/ వెళ్లి తమ ఫలితాలను చెక్‌చేసుకోగలరు.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టులకు గతంలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9వ తేదీన జరిగింది. ఈ పరీక్ష పెన్ను పేపర్ విధానంలోనే జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మరోవైపు... మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీజీపీఎస్‌సీ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పేపర్లు ఇవే..
అక్టోబర్ 21- జనరల్ ఇంగ్లిష్(క్వాలిఫైయింగ్ పేపర్)
అక్టోబర్ 22- పేపర్-I (జనరల్ ఎస్సే)
అక్టోబర్ 23- పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం)
అక్టోబర్ 24 - పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్)
అక్టోబర్ 25 - పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్)
అక్టోబర్ 26 - పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ )
అక్టోబర్ 27- పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం)
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications