తెలంగాణ గురుకుల కాలేజీల్లో 149 పోస్టులు: వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కాలేజీల్లో పలు పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ తోపాటు ఐఐటీ-జేఈఈ(మెయిన్/అడ్వాన్స్‌డ్), నీట్ శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ ఖాళీల నియామకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది.
పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్స్
మొత్తం పోస్టులు: 149
సబ్జెక్టులవారీగా ఖాళీలు

గణితం: 26
భౌతికశాస్త్రం: 29
రసాయన శాస్త్రం: 32
వృక్షశాస్త్రం: 30
జంతుశాస్త్రం: 32
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్ శిక్షణకు సంబంధించిన అనుభవం.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 23, 2022.
పరీక్ష తేదీ: జులై 31, 2022
డెమో లేదా ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 08, 2022
వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.tgtwgurukulam.telangana.gov.in/ ను సంప్రదించండి.












Click it and Unblock the Notifications