ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్: వెంటనే అప్లై చేయండి
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ హైకోర్టు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 150 పోస్టులు ఉన్నాయి.
ముఖ్య తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం - ఏప్రిల్ 18, 2024.
దరఖాస్తులకు చివరి తేదీ - మే 17, 2024.
హాల్ టికెట్లు డౌన్లోడ్ - 08 జూన్ 2024.
స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) - 16 జూన్ 2024.

విద్యార్హతలు:
నోటిఫికేషన్ ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ పొంది ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ 2023 ప్రకారం నిర్ధేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
ఫీజు వివరాలు:
ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
వేతనం:
నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎంపికైతే జీతం నెలకు రూ. 77, 840 నుంచి 1లక్షా 36వేల 520 రూపాయలు ఉంటుంది.
ఎంపిక :
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. జాబ్ పొందాలంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ దశలన్నింటినీ క్లియర్ చేయాలి.
మొదటిది స్క్రీనింగ్ టెస్ట్:
100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. దీనికి సమయం 2 గంటలు. స్క్రీనింగ్ టెస్ట్ కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలను ఎగ్జామ్ సెంటర్లుగా ఎంపిక చేశారు.
రెండవది మెయిన్స్:
స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధిస్తే... మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఇది 1:10గా ఉంటుంది. మెయిన్స్ పరీక్షల్లో మూడు పేపర్లు ఉంటాయి. సివిల్ లా, క్రిమినల్ లాతో పాటు ట్రాన్స్లేషన్ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయిస్తారు. ఇంగ్లీష్‌లోనే పరీక్ష ఉంటుంది.
చివరగా వైవా:
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారు వైవాకు అర్హత సాధిస్తారు. ఇది 1:3గా ఉంటుంది.
దరఖాస్తు:
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్సైట్ https://tshc.gov.in/getRecruitDetails సంప్రదించవచ్చు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications