తెలంగాణ ఐసెట్ రిజల్ట్స్ రిలీజ్..
తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG ICET-2025) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి మార్కులు, ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు https://icet.tsche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ICET ర్యాంక్ ఆధారంగా విద్యార్థులకు తెలంగాణలోని వివిధ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులలు అందుబాటులో ఉన్న కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించనున్నారు. అభ్యర్థులు తమ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.

కాగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 8, 9 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్ష అనంతరం జూన్ 15న ప్రాథమిక కీ విడుదల చేశారు. ఇప్పుడు జూలై 1, 2025న అధికారికంగా ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు సుమారుగా 80,000కు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాకతీయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించారు.
విద్యార్ధులకు సూచనలు..
ఫలితాలలో అర్హత సాధించిన విద్యార్థులు త్వరలో ప్రారంభమయ్యే TG ICET కౌన్సెలింగ్ 2025కు నమోదు చేసుకోవాలి.
వెబ్-ఆప్షన్ల ప్రక్రియ ద్వారా విద్యార్థులు తమ కోర్సు మరియు కాలేజ్ ఎంపికలు నమోదు చేయాల్సి ఉంటుంది.
సీటు కేటాయింపు తరువాత, అభ్యర్థులు ఆయా కాలేజీల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు చేయవలసినవి..
హాల్ టికెట్, ర్యాంక్ కార్డు ప్రింట్ తీసుకోవడం
మార్క్ షీట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్లు సిద్ధం చేయడం
కాస్టు/ఇన్కమ్ సర్టిఫికెట్ (అవసరమైన వారికి)
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు












Click it and Unblock the Notifications