తెలంగాణ వెటర్నరీ, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్స్‌లో 207 పోస్టులు: వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణలో మరో నోటిఫికేషన్ విడుదలైంది. వెటర్నరీ, హార్టికల్చర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 207 పోస్టుల భార్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు, హార్టికల్చర్ విభాగంలో 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు డిసెంబర్ 30 నుంచి వచ్చే నెల(జనవరి) 19వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు జనవరి 3 నుంచి అదే నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రెండు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఇతర మరిన్ని వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ www.tspsc.gov.inను సందర్శించొచ్చు.

తెలంగాణలో 4661 స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకు నెలాఖరులోగా నోటిఫికేషన్
తెలంగాణలో భారీ ఎత్తున నర్సు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ త్వరలో 4,661 స్టాఫ్ నర్సు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. డిసెంబర్ నెలాఖరులోగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రానుంది.
నర్సుల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. నోటిఫికేషన్ తర్వాత పరీక్షకు అభ్యర్థులు సిద్ధమయ్యేందుకు రెండు నెలల గడువు ఇస్తారని తెలిసింది. బహుళ ఐచ్ఛిక సమాధానాల రూపంలో ప్రశ్నపత్రం రూపకల్పనకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించనున్నారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వీరు ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థకు అందజేస్తారు.












Click it and Unblock the Notifications