Jobs: నెలకు రూ.2,46,400 నుంచి 3,52,000 వరకు జీతం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సంస్థ అనేక మందికి విదేశాల్లో ఉద్యోగా అవకాశాలను కల్పిస్తోంది. తాజాగా జర్మనీలో ఉద్యోగాల కోసం నైపుణ్యం కలిగిన ఆటోమోటివ్ టెక్నీషియన్‌లను నియమించుకునే ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనుంది. గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, జపాన్, పోలాండ్, రొమేనియా, యూకే వంటి దేశాల్లో పని చేసేందుకు వివిధ ప్రభుత్వ, రిజిస్టర్డ్ ప్రైవేట్ ఏజెన్సీల భాగస్వామ్యంతో టామ్‌కామ్ పనిచేస్తోంది.
జర్మనీలో ఉద్యోగాల కోసం రిక్రూట్ చేసుకోవడానికి అర్హతలు కూడా వివరించారు. అభ్యర్థులు మెర్సిడెస్, హ్యుందాయ్, నిస్సాన్, కియా, ఇతర ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్‌లతో పనిచేసిన కనీసం 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. దానితో పాటు కనీసం మూడు సంవత్సరాల అధ్యయనం అవసరం. అభ్యర్థుల వయోపరిమితి 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు తమ ఉద్యోగ స్థానాలకు వారిని సిద్ధం చేయడానికి జర్మనీలో 6 నుండి 9 నెలల భాషా శిక్షణ పొందాల్సి ఉంటుంది.

జీతం అనుభవాన్ని బట్టి నెలకు €2800 నుంచి €4000 వరకు ఉంటుంది. భారత కరెన్సీ ప్రకారం రూ.2,46,400 నుంచి 3,52,000 వరకు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు టామ్ కామ్ వెబ్‌సైట్‌ను సంప్రదించ్చు లేదా 94400 52592 / 94400 49013లో హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. కొద్ది రోజుల క్రితం
జర్మనీలోని ప్రసిద్ధ ఆసుపత్రులలో ఉద్యోగాలు పొందేందుకు తెలంగాణ నర్సులకు జర్మన్ భాషా నైపుణ్యాలలో శిక్షణనిచ్చే లక్ష్యంతో టామ్‌కామ్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండే ప్రోగ్రామ్ B2 స్థాయి వరకు సమగ్ర జర్మన్ భాషా శిక్షణను అందిస్తుంది. విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులకు జర్మనీలో స్టాఫ్ నర్సులుగా నెలకు రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు జీతాలు లభించనుంది.












Click it and Unblock the Notifications