తెలంగాణ పాలిసెట్ వాయిదా: కొత్త తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(Polycet 2024) వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను విద్యాశాఖ వాయిదా వేసింది. మే 17న పాలిసెట్ జరగాల్సి ఉండగా.. మే 24న నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి నెలలో పాలిసెట్ నోటిఫికేషన్ విడులైన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్) సీట్లను పాలిసెట్ లో సాధించిన ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. రూ. 100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 24 వరకు, రూ. 300 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Telangana polycet postponed

జూన్ 20 వరకు డీఎస్సీ దరఖాస్తులు స్వీకరణ

డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు: దరఖాస్తు గడువు పొడిగింపు తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ(DSC) పరీక్షకు తేదీలను ఖరారు చేసింది విద్యాశాఖ. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అయితే, తాజాగా, ఈ తేదీని జూన్ 20 వరకు పొడిగించారు.

మొత్తం ఉద్యోగాల్లో 2629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6508 ఎస్జీటీలు ఉన్నాయి. ఇంకా, స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా, ఆ తర్వాత ఖమ్మంలో 757, నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+