తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల: ఇలా తెలుసుకోండి
హైదరాబాద్: తెలంగాణలో సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ) ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమిక 'కీ' ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష కీని www.tslprb.in లో చూడవచ్చని తెలిపింది.
ఇక 'కీ'పై అభ్యంతరాలుంటే ఆగస్టు 15 వరకు స్వీకరిస్తామని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 544 ఎస్ఐ పోస్టుల కోసం ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల కాగా.. 2,47,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో 503 పరీక్ష కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఆగస్టు 7న జరిగిన ప్రాథమిక పరీక్షకు 91.32 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 2,25,759 మంది పరీక్ష రాసినట్లు బోర్డు తెలిపింది.
ఎస్ఐ రాత పరీక్ష ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications