తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల: కీలక తేదీలివే
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలను నిర్వహించనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమైన ప్రవేశాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఎస్ఎస్‌సీ, ఇంటర్ మార్కుల మెమోలు, టీసీ, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారం కోసం టీజీఈఏపీ వెబ్‌సైట్‌ని సందర్శించాలని పేర్కొంది. కాగా, జూన్ 27 తేదీ నుంచి ప్రవేశాలను మొదలు పెట్టాలని ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ ప్రక్రియలో భాగంగా జూన్ 30 తేదీ నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు ఆవకాశం ఇవ్వనున్నారు. ఇక చివరగా మొదటి విడత సీట్ల కేటాయింపు జూలై 12వ తేదీన జరగనుంది. ఆ తదుపరి జూలై 19వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ మొదలు కానుంది.
రెండో విడతలో జూలై 24 తేదీ సీట్ల కేటాయింపు జరుగనుంది. ఇక చివరి మూడో విడత కౌన్సిలింగ్‌ను జూలై 30 తేదీ మొదలు పెట్టి.. ఆగస్టు 5 తేదీ వరకు సీట్లు కేటాయించబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆగస్టు 12వ తేదీ నుంచి ఏదైనా ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపులను
ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టనున్నారు. ఇక చివరగా ఆగస్టు 17 తేదీన స్పాట్ ఆడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనుంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications