TG TET 2024 Hall Tickets: తెలంగాణ టెట్ హాల్ టికెట్ల విడుదల- డౌన్ లోడ్ ఇలా..!

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ టెట్ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్ధుల కోసం ఇవాళ విడుదల చేసింది. వీటిని ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రింట్ తీసుకుని వీటిని పరీక్షకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే టెట్ హాల్ టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచిన ప్రభుత్వం..వాటిని ఎక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలో వివరాలు వెల్లడించింది.

తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం నిర్వహించి డీఎస్సీ పరీక్షకు అర్హత పరీక్షగా ఉన్న టెట్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20 వరకూ కేటగిరీల వారీగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఆయా కేటగిరీల అభ్యర్ధులకు ఆయా తేదల్లో పరీక్షలు ఉంటాయి. వీటికి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. వీటిని టెట్ అధికారిక వెబ్ సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/ లో ఎంటర్ కావడం ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Telangana TET 2024 exam hall tickets out- here is how to download

ఈ వెబ్ సైట్ లోకి ఎంటర్ కాగానే హాల్ టికెట్ డౌన్ లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయగానే జర్నల్ నంబర్, పుట్టినతేదీ వివరాలు ఎంటర్ చేస్తే ప్రొసీడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల జనవరి 11న ఉదయం సెషన్ లో జరిగే పరీక్షలు, అలాగే 20వ తేదీ ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులో ఉంచడం లేదని ప్రభుత్వం తెలిపింది. వీటిని రేపటి నుంచి అందుబాటులో ఉంచుతారు.

టెట్ పరీక్షలు ఉదయం సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకూ, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి 4.30 వరకూ ఉంటాయి. జనవరి 2, 5, 11,12, 19, 20 తేదీల్లో పేపర్ 2 పరీక్షలు ఉంటాయి. అలాగే జనవరి 8,9,10, 18 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు 2.75 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+