తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET 2024) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. మే 20 నుంచి జూన్ 2 వరకు వివిధ తేదీల్లో జరగనున్న ఈ పరీక్షల హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. బుధవారమే హాల్ టికెట్లను విడుదల చేస్తారని అభ్యర్థులు ఎదురుచూసినప్పటికీ.. గురువారం సాయంత్రం విడుదల చేశారు.
నేటి సాయంత్రం నుంచి టెట్ హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా, టెట్ కోసం 2,83,441 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

మే 20 నుంచి జరిగే ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు జూన్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులకు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే 7032901383 నెంబర్ ను సందప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
టెట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications