TG TET 2024 : టెట్ ఫలితాలు 2024 విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
తెలంగాణ టెట్ ఫలితాలు 2024 విడుదలయ్యాయి. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు గత నెల 20 నుంచి జూన్ 2వరకు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా, వీటి ఫలితాలను బుధవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు తాజాగా వీటి ఫలితాలను కూడా రీలిజ్ చేశారు. టెట్ పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50,491మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పేపర్-1లో 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, పేపర్-2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13%. పేపర్-2లో అర్హత సాధించిన వారు 34.18%. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగినట్లు విద్యాశాఖ తెలిపింది. 20023తో పోలిస్తే పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగింది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ను https://results.eenadupratibha.net/ సంప్రదించగలరు.

ఈ సారి టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగానే పరీక్షలు రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాది మొదటిసారిగా తెలంగాణ టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు జరిగాయి.
మే 20వ తేదీన ప్రారంభమైన తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,36,487 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులు. అలాగే, పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు.












Click it and Unblock the Notifications