TGPSC : తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ - 4 ఫలితాలను వెల్లడించింది. 8,084 మందితో కూడిన ప్రొవిజనల్ లిస్ట్‌ను గురువారం విడుదల చేసింది. 2022 డిసెంబర్ 1న ఇచ్చిన నోటిఫికేషన్లో భాగంగా 8,180 పోస్టులకు గాను 9 లక్షల 51వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కమిషన్ పేర్కొంది.
పలు దఫాల్లో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం నేడు ఫలితాలు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in ను సందర్శించాలని సూచించింది.

తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలకు టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై సీఎస్ శాంతికుమారి సమీక్ష చేసి పరీక్షలను సజావుగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, నవంబర్ 17, 18 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాలవారీగా హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.
హెల్ప్ లైన్ నెంబర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాగా, నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరగనుంది. తెలంగాణలో దాదాపు 1380కిపైగా గ్రూప్ 3 పోస్టుల కోసం 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications