TGPSC : నేడు టిఎస్ గ్రూప్ 1 ప్రాథమిక కీ విడుదల..
నేడు తెలంగాణ గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష కీ విడుదల చేయనున్నారు. ఆన్సర్‌కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కూడా నేడు (గురువారం) వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు గాను గతంలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాల్లో వీరందరికీ ఈనెల 9వ తేదీన పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఇక, వీటి ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ఈ ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించేందుకు జూన్ 17వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఈ కీపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే జూన్ 13వ తేది నుంచి 17వ తేది వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ రూపొందించి ఫైనల్ కీని తయారు చేస్తారు. అనంతరం ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు.
563 గ్రూప్-1 పోస్టులకు గాను 3.02 లక్షల మంది (74 శాతం) అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాల ప్రకటన తర్వాత మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్ పరీక్షకు 28,150 మందిని ఎంపిక చేయనున్నట్లు ఇప్పటికే కమిషన్ ప్రకటించింది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే కమిషన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కేంద్రాలన్నీ హైదరాబాద్‌లోనే ఉంటాయని తెలిపింది. ప్రతి పేపర్ కాలపరిమితి మూడు గంటలు ఉంటుంది. పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని కమీషన్ వెల్లడించింది. ప్రతి పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్ పేపరు పదోతరగతి స్థాయిలో ఉంటాయని, ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకుల నిర్ధరణలో పరిగణనలోకి తీసుకోబోమని తెలంగాణ కమీషన్ స్పష్టం చేసింది.

-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications