TGRTC : ఆర్‌టిసీలో 3035 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు గ్రీన్‌సిగ్నల్..
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఓ శుభవార్తను అందించింది. టీజీఎస్‌ఆర్టీసీ లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా మొత్తం 3035 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక, తెలంగాణ ఆర్‌టిసిలో 3035 పోస్టుల భర్తీకి గతకొంతకాలంగా కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే, తాజాగా తెలంగాణ సర్కారు నుంచి అనుమతి లభించింది. దీంతో త్వరలోనే ఆర్‌టిసిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
మొత్తం పోస్టులు 3035 ఉండగా, ఇందులో...
డ్రైవర్ పోస్టులు 2000,
శ్రామిక్ పోస్టులు 743
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) 114
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84
డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25
అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) 23
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15
సెక్షన్ ఆఫీసర్(సివిల్) 11
మెడికల్ ఆఫీసర్(జనరల్) 7
మెడికల్ ఆఫీసర్(స్పెషాలిస్ట్) 7

స్పందించిన రవాణా శాఖ మంత్రి...
ఆర్టీసీలోని వివిధ కేటగిరిల్లో 3035 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications