తెలంగాణలో 3 నోటిఫికేషన్లు విడుదల: వందలాది పోస్టుల కోసం 20 నుంచే అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా, శనివారం మరో మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పురపాలక శాఖలో 78 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటికి జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

విద్యాశాఖలో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి కూడా నేడు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్ పోస్టులు, సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్ పీఎస్సీ వెల్లడించింది.

Three new job notifications released in Telangana to fill hundreds of posts

కళాశాల విద్యాశాఖలో 544 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే లేదా జూన్ నెలలో నియామక పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ సంప్రదించవచ్చు.

తాజాగా, మరో నోటిఫికేషన్

113 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్(ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. మే లేదా జూన్ నెలలో నియామక పరీక్ష ఉంటుందని టీఎస్‌పీఎస్సీ తేలింది.

తెలంగాణ గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల: 1365 పోస్టులు

1365 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ శుక్రవారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 24 నుంచి ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ‌లోగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మరిన్ని వివ‌రాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 1365

అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ డిపార్ట్‌మెంట్: 27
ఎనిమల్ హస్బెండ్రీ, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీష్: 02
బ్యాక్వార్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 27
ఎనర్జీ డిపార్ట్‌మెంట్: 02
ఎన్వీరాన్మెంట్, ఫారెస్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్: 07
ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్: 712
ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్: 16
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్: 46
హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 39
హైయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్: 89
హోం డిపార్ట్‌మెంట్: 70
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్: 25
ఇరిగేషన్ అండ్ కామండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్‌మెంట్: 01
లేబర్ అండ్ ఎప్లాయ్ మెంట్ డిపార్ట్‌మెంట్: 33
మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 06
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్: 18
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ : 29
ప్లానింగ్ డిపార్ట్‌మెంట్: 03
రెవెన్యూ డిపార్ట్‌మెంట్: 73
షెడ్యూల్ క్యాస్ట్స్ డెవలప్మెంట్ డిపార్ట్‌మెంట్: 36
సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్: 56
ట్రాన్స్ పోర్ట్, రోడ్, బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్: 12
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 27
ఉమెన్, చిల్డ్రెన్, డిసబెల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్‌మెంట్: 03
యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజమ్ అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్: 05
ట్రైబల్ వెల్ఫేర్(ట్రైకోర్): 01

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+