టిఎస్ పీజీఈసెట్ 2024 ద‌ర‌ఖాస్తుకు నేడే లాస్ట్ డేట్.. అప్ల‌య్ చేశారా?!

టిఎస్ పీజీఈసెట్ అప్ల‌య్ చేసేందుకు నేడే చివ‌రి తేది. కావున అర్హ‌త, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులంద‌రూ ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. తెలంగాణ పీజీ ఈసెట్ 2024 ప్రవేశపరీక్ష దరఖాస్తుల సమర్పణకు గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో పీజీ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కోసం ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. పీజీఈసెట్ ప్ర‌వేశ పరీక్ష కోసం తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక‌, నేటితో ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగియ‌నుంది. ఈ ప‌రీక్ష‌ను హైద‌రాబాద్ జేఎన్‌టియూ యూనివ‌ర్సిటి నిర్వ‌హించ‌నుంది. బీఈ/బీటెక్/బీఆర్క్/ బీప్లానింగ్/బీఫార్మసీ, ఎంఏ/ఎంఎస్సీ (సోషియాలజీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ) లో ఉత్తీర్ణులైన అభ్య‌ర్థులు మాత్ర‌మే ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు..ద‌ర‌ఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

తెలంగాణ పీజీఈసెట్ రాత‌ ప‌రీక్ష‌లు జూన్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 13వ తేదీ వ‌ర‌కూ ఈ ప‌రీక్ష‌ల‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప‌రీక్ష ద్వారా ఎంఈ, ఎంటెక్, , ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో అభ్య‌ర్థులు ప్రవేశాలు పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. రూ.2500 ఆల‌స్య రుసుముతో అప్లికేషన్లకు తుది గడువు మే 21తో ముగినుంది. రూ.5000 ఆల‌స్య రుసుముతో 25-మే-2024 వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Today is the last date for TS PGECET 2024 application Have you applied

తెలంగాణ పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ హాల్‌ టికెట్లను ఈ నెల 28 నుంచి అభ్య‌ర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్య‌ర్థులకు ఏవైనా సందేహాలుంటే అధికారిక వెబ్ సైట్ - https://pgecet.tsche.ac.in/
ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు మాత్రం ఈ లింక్‌పై క్లిక్ చేసి https://pgecet.tsche.ac.in/PGECET_HomePage.aspx అప్ల‌య్ చేసుకోగ‌ల‌రు.

ఇత‌ర ముఖ్య‌మైన తేదీలు..

రూ.2500 ఆల‌స్య రుసుముతో 21-05-2024 వ‌ర‌కు అప్లయ్ చేసుకోవ‌చ్చు.
రూ.5000 ఆల‌స్య రుసుముతో 25-05-2024 వ‌ర‌కు దరఖాస్తు చేసుకోవ‌చ్చు.

28.05.2024 హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు.

10.06.2024 నుంచి పీజీ ఈసెట్ పరీక్షలు ప్రారంభం...

13.06.2024ను ప‌రీక్ష‌లు ముగుస్తాయి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+