Jobs in UAE: దుబాయ్‌లో ఉద్యోగం చేయాలనుందా?.. హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు.. ఈ అర్హతలుంటే జాబ్ మీదే!
Jobs in UAE: దుబాయ్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా! అలాంటి వారికి ఇది సువర్ణావకాశం. ఈ ఉద్యోగాల కోసం లేబర్, ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ(TOMCOM) హైదరాబాద్ లో ఇంటర్వ్యూలు నిర్వహించనునంది. టామ్‌కామ్ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో యూఏఈలోని వివిధ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. యూఏఈలో సిరామిక్ కాస్టర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ట్రైనీ కాస్టర్, జూనియర్ ప్రాసెస్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం కనీసం రెండు సంవత్సరాల అనుభవం లేదా సిరామిక్ సెంటర్ నుంచి శిక్షణ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. దీంతో పాటు పదో తరగతి పాస్ అయి ఉండాలి. ట్రైనీ కాస్టర్ (10వ తరగతి ఉత్తీర్ణత), జూనియర్ ప్రాసెస్ ఆపరేటర్(ఐటీఐ అర్హత కలిగి ఉండాలి) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
యూఏఈలో ఉద్యోగాల కోసం హైదరాబాద్ విజయనగర కాలనీలోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్ లో ఉన్న టామ్ కామ్ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటాను [email protected] కు పంపవచ్చని టామ్ కామ్ ప్రతినిధులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక టామ్‌కామ్ వెబ్ సైట్ https://tomcom.telangana.gov.in/ చూడొచ్చు. లేదా 94400 49937, 94400 49861, లేదా 94400 51452 నంబర్‌లలో నేరుగా సంస్థను సంప్రదించవచ్చు.

2016లో ఏర్పాటైన టామ్‌కామ్
నైపుణ్యం ఉన్న తెలంగాణలోని యువతకు గల్ఫ్ తో పాటు ఇతర దేశాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర సర్కారు టామ్‌కామ్ ను ఏర్పాటు చేసింది. ఆయా దేశాల్లో ఉన్న రాయబారులతో సంప్రదింపులను జరిపి అవసరాల మేరకు ఉద్యోగ నియమాకాలను చేపడుతోంది. విదేశీ ఉద్యోగాల పేరిట జరిగే మోసాలను కూడా ఈ సంస్థ అడ్డుకుంటోంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలను కల్పించడం కోసం రాష్ట్ర సర్కారు 2016లో ఈ సంస్థను ఏర్పాటు చేసింది.
నైపుణ్యం గల తెలంగాణ యువతకు గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం TOMCOM ఏర్పాటు చేసింది. ఆయా దేశాల రాయబారులతో సంప్రదింపులు జరిపి అవసరాల మేరకు నియామక ప్రక్రియ చేపడుతోంది. విదేశీ ఉద్యోగాల పేరిట జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)ను ఏర్పాటు చేసింది. ఉద్యోగ నియామకాల కోసం టామ్ కామ్ ను విదేశీ సంస్థలు సంప్రదిస్తున్నాయి. టామ్ కామ్ ఆధ్వర్యంలో నర్సులు, పారామెడికల్ ఆటో మొబైల్, వైమానిక, భవన నిర్మాణం, నిర్వహణ, యంత్ర విడిభాగాల తయారీ, ఆతిథ్య రంగం,పారిశ్రామిక యంత్రాలు, వ్యవసాయం, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, నౌకాయానం, ఆహారం, కూల్ డ్రింక్స్, మత్స్య రంగంలో టామ్ కామ్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
జపాన్ లో ఉద్యోగాల కోసం హైదరాబాద్ లో శిక్షణ
జపాన్ లో ఉద్యోగ అవకాశాల కోసం తెలంగాణ నుంచి స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇవ్వడానికి, నియమించడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.జపాన్ స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ (SSW) పథకం కింద హైదరాబాద్ లోని నర్సులకు విద్య, శిక్షణ అవకాశాలను అందిస్తుంది. తర్వాత జపాన్ ఆరోగ్య రంగంలో ఉద్యోగ నియామకాలు అందిస్తుంది. ఇప్పటివరకు టామ్‌కామ్ తన మొదటి రెండు బ్యాచ్ ల నుంచి 32 మంది నర్సులను జపాన్ లోని ఆస్పత్రులలో నియమించింది. మూడో బ్యాచ్ నర్సులు ప్రస్తుతం వారి వీసా ప్రాసెసింగ్ ను పూర్తి చేస్తున్నారు. త్వరలో జపాన్ లోని అగ్రశ్రేణి ఆస్పత్రులలో చేరనున్నారు. రాబోయే బ్యాచ్ లకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి టామ్ కామ్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications